బాలకృష్ణ తో తాప్సీ

Tapsee Acting With Balayya



బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘హరహరమహదేవ’ చిత్రానికి ఇప్పటిదాకా హీరోయిన్‌ను ఎంపిక కాలేదన్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా తాప్సీ ఈ చిత్రంలో హీరోరదయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తమిళంలో కూడా తాప్సీ హవా కొనసాగిస్తోకన్న ఆమె తనకు వచ్చిన ఏ అవకాశమూ వదిలేటట్లు లేదు.దాంతో బెల్లంకొండ ఆమెను సంప్రదించి ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌తో కలిసి ‘మొగుడు’చిత్రం చేస్తోంది. బాలకృష్ణ కధానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ‘హర హర మహాదేవ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ మధ్యన హైటెక్స్ లో జరిగింది. అప్పుడు పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ‘ముహూర్తానికి 25 డైలాగులు రాసాము. అందులో ఓ డైలాగును ప్రారంభదృశ్యంలో బాలకృష్ణ గారు చెప్పారు. అది ‘సై అంటే శరభ శరభ… జై అంటే ఆయుష్మాన్ భవ… కాదని ఎదురొస్తే హరహర మహాదేవ’. ఈ సినిమా చాలా పవర్ ఫుల్ డైలాగులతో వుంటుంది.
Share this article :

Post a Comment